AI Technology: ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) పేరు మార్మోగుతోంది. రానున్న కాలంలో AI టెక్నాలజీ శాసిస్తుందని చెబుతున్నారు. ఇది ప్రపంచ మానవాళి జీవితాన్ని మరింత సులభంగా మారుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే AI టెక్నాలజీ నుంచి మానవాళికి ముప్పు పొంచి ఉందని గూగుల్ మాజీ సీఈఓ ఎరిక్ ష్మిత్ హెచ్చరించారు.