టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చాలా మతిమరుపు. అతను వస్తువులను ఒక దగ్గర పెడుతాడు.. వాటిని మరచిపోతాడు. చాలా సార్లు టాస్ సమయంలో కూడా ముందుగా బౌలింగ్ ఎంచుకోవాలా లేదా బ్యాటింగ్ ఎంచుకోవాలా అని మర్చిపోతాడు. అయితే ‘హిట్ మ్యాన్ ’గా పేరుగాంచిన రోహిత్ గేమ్ ప్లాన్ ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ మరిచిపోడు. ఈ రహస్యాన్ని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ బయటపెట్టాడు.