Love Jihad: ప్రేమ పేరుతో హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి, బలవంతంగా ఇస్లాం మతంతోకి మార్చుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘‘లవ్ జిహాద్’’ ముఠాను ఉత్తర్ ప్రదేశ్ కుషినగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరు మహిళలతో సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. సునీల్ వర్మ అనే వ్యక్తి, తన 19 ఏళ్ల కుమార్తెను ప్రలోభపెట్టి అమృత్‌సర్ తీసుకెళ్లారని, అక్కడ ఆమెను బలవంతంగా మతం మార్చి, దాచిపెట్టారని ఫిర్యాదు దాఖలు చేయడంతో ఈ అరెస్టులు జరిగాయి.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ యువకుడు సోషల్ మీడియాలో ఓ అమ్మాయితో స్నేహం చేశాడు. తాను హిందువు అని చెప్పుకున్నాడు. కానీ ఆ అమ్మాయి ఆ అబ్బాయి మతం, నిజస్వరూపం గురించి తెలుసుకుంది. ఈ విషయం బయటకు చెబితే.. ఆమెను, ఆమె కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు.
Forced Conversion: బలవంతంగా మతం మార్చడం తీవ్రమైన అంశమేనని అలహాబాద్ హైకోర్టు తేల్చి చెప్పింది. బలవంతపు మత మార్పిడి రాజ్యాంగ విరుద్ధమని పేర్కొనింది. భారతదేశంలో నివాసం ఉంటున్న వారంతా ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం ముందుకు నడుచుకోవాలని సూచించింది.
మత మార్పిడి నిందితులకు బెయిల్ మంజూరు చేసేందుకు కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. వివాహిత షెడ్యూల్డ్ కులానికి చెందిన మహిళను బందీగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడని.. బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారని ఫిర్యాదుపై నిందితుడిపై కేసు నమోదైంది.
హిందూ సమాజంలోని బాలికలను బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్నారన్నారు. పాకిస్థాన్ రాజ్యాంగం బలవంతపు మత మార్పిడిని అనుమతించదని, అలాగే ఖురాన్ కూడా అనుమతించలేదనే విషయాన్ని పాకిస్తాన్ హిందూ నాయకుడు, సెనేట్ సభ్యుడు దనేష్ కుమార్ పల్యాని గుర్తు చేశారు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. వేర్వేరు మతాలకు చెందిన యువతీ యువకుడు ప్రేమించుకున్నారు. అయితే ప్రేమకు అడ్డురాని మతం, పెళ్లికి మాత్రం అడ్డొచ్చింది. ఇస్లాంలోకి మారితేనే పెళ్లి చేసుకుంటానని లవర్ చెప్పడంతో ఇది ఇష్టం లేని యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటు చేసుకుంది. ఈ కేసులో 24 ఏళ్ల షారూఖ్ అనే నిందితుడిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు.