Pele Death: ప్రముఖ ఫుట్‌బాల్ దిగ్గజం, బ్రెజిల్ మాజీ ఆటగాడు పీలే (82) మృతిచెందారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన సావో పాలోలోని ఐన్‌స్టీన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన మరణంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పీలే బ్రెజిల్‌కు మూడుసార్లు ప్రపంచకప్ అందించారు. 1958, 1962, 1970లలో ఫిఫా ప్రపంచ కప్‌ను మూడుసార్లు గెలిపించిన ఏకైక ఆటగాడు పీలే. ఆయన బ్రెజిల్ తరఫున 92 అంతర్జాతీయ…
Be Ready with B Better: కాసులు లేకపోయినా పర్లేదు గానీ కాలూ చెయ్యీ బాగుంటే చాలు.. అదే పది వేలు.. అంటుంటారు పెద్దలు. ఇది అక్షర సత్యం. లక్షల విలువ చేసే మాట. కానీ.. ఫిట్‌నెస్ విషయంలో అప్పటివాళ్లకు, ఇప్పటివాళ్లకు చాలా తేడా ఉంది. ఆ రోజుల్లో ఆహారపు అలవాట్లు వేరు. వాళ్ల జీవన శైలి సైతం ఎంతో విభిన్నంగా ఉండేది. ప్రజెంట్ జనరేషన్ లైఫ్ స్టైల్‌కి అస్సలు పోలికే లేదు. అందుకే ఆ తరంవాళ్లు…
వ్యాక్సిన్ పై ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ అనేక అనుమానాలు, అపోహలు ఉన్నాయి. వ్యాక్సిన్ వేయించుకుంటే ఆరోగ్యం చెడిపోతుందని, పిల్లలు పుట్టరనే అపోహలు చాలా మందిలో ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లో అంటే సరిలే అనుకోవచ్చు. కానీ, అభివృద్ది చెందిన ప్రాంతాల్లో కూడా వ్యాక్సిన్ వేయించుకోవడానికి సందేహిస్తున్నారు. లండన్‌లో కరోనా, ఒమిక్రాన్ కేసులు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. Read: తెలంగాణలో మొత్తం 20 ఒమిక్రాన్ కేసులు నమోదు ప్రస్తుతం లండన్‌లో ఇంగ్లీష్ ప్రీమియం ఫుట్‌బాల్ లీగ్…
ప్రపంచంలో అత్యథిక ప్రజాధరణ పొందిన గేమ్ ఫుట్‌బాల్. ఈ గేమ్ అంటే మనుషులకే కాదు జంతువులకు కూడా ఇష్టమే. అప్పుడప్పుడూ అవి కూడా ఫుడ్‌బాల్ గేమ్ అడుతూ వాటిలోని ప్రతిభను బయటపెడుతుంటాయి. 2019లో ఓ దుప్పి తన తలతో ఫుట్‌బాల్ గేమ్ ఆడి గోల్ చేసింది. బాల్‌ను గోల్‌లోకి పంపిన తరువాత ఆనందంతో ఎగిరి గంతులేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. Read: భారత్‌లో పెరిగిపోతున్న స్పామ్ కాల్స్… ఆ నెంబర్ నుంచి 20 కోట్ల సార్లు…
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ మరో అరుదైన రికార్డు సాధించాడు. ఫుట్‌బాల్ ఆటలో ప్రతిష్టాత్మక బాలన్ డార్ అవార్డును ఏడుసార్లు అందుకుని మెస్సీ చరిత్ర సృష్టించాడు. ఇటీవల జరిగిన కోపా అమెరికా టోర్నీలో 34 ఏళ్ల మెస్సీ తమ దేశ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ టోర్నీ ఫైనల్‌లో బ్రెజిల్‌పై అర్జెంటీనా 1-0 తేడాతో టైటిల్ కైవసం చేసుకుంది. దీంతో 28 ఏళ్ల తర్వాత అర్జెంటీనాకు మెస్సీ మెగా టోర్నీ టైటిల్ అందించాడు. Read Also:…
ఖతర్ వేదికగా వచ్చే ఏడాది ఫిఫా వరల్డ్ కప్ 2022 జగరబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు అనేక దేశాలు పోటీ పడుతుంటాయి. దక్షిణ అమెరికా టాప్ 10 లో బ్రెజిల్ 35 పాయింట్లు సాధించి నెంబర్ 1 స్థానంలో నిలవగా, అర్జెంటైనా 29 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటికే బ్రెజిల్ ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. ఇక ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో భాగంగా బ్రెజిల్-అర్జెంటైనా జట్ల మధ్య ఈరోజు మ్యాచ్ జరిగింది.…
ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది ఇష్టపడే గేమ్ ఫుట్‌బాల్. యూరప్, ఆఫ్రికా, అమెరికా దేశాల్లో ఈ క్రీడలకు మంచి ప్రాచుర్యం ఉన్నది. మనదేశంలో కూడా ఈ గేమ్‌కు ఆదరణ ఉన్నా, దానికి తగిన మౌళిక సదుపాయాలు, శిక్షణ లేకపోవడంతో కొంత వెనకబడి ఉన్నది. అయితే, కొన్ని ప్రాంతాల్లో పిల్లలు గల్లీగ్లలీల్లో ఆ ఫుట్‌బాల్ గేమ్ ఆడుతుంటారు. ఒడిశాలోని సబరంగ్‌పూర్ జిల్లాలోని సుకీగావ్ అనే గ్రామంలో పిల్లలు ఫుట్‌బాల్ గేమ్ అడుతుండగా పక్కనే ఉన్న అడవిలోనుంచి రెండు ఎలుగు…