CM Cup 2023: నేటి నుంచి సీఎం కప్ పోటీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Cup 2023: మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని సర్కార్ భావించింది. ఎంతో టాలెంట్ ఉండి గ్రామాలకే పరిమితమవుతున్న క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు, వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్-2023 క్రీడాపోటీలకు శ్రీకారం చుట్టింది. 15 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువతీ యువకులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో వివిధ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. అన్ని మండల కేంద్రాల్లో అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్‌బాల్ విభాగాల్లో మొదట మండల స్థాయిలో పోటీలను 15 నుంచి 17వ తేదీ వరకు మూడు రోజులపాటు నిర్వహిస్తారు.
Read Also:Zero Balance : బ్యాంకు ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ..
Also Read
- Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
ప్రతిభ కనబర్చిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేయనున్నారు. జిల్లా స్థాయిలో పోటీలను ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించి ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయిలో ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు పోటీలు నిర్వహించనున్నారు. మండల స్థాయిలో విజయవంతంగా నిర్వహించడానికి మండల స్థాయి అధ్యక్షులు, చైర్మన్లు, జడ్పీటీసీ, ఎంపీడీవో, తహసీల్దార్, ఎస్సై మెంటర్లుగా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, చైర్మన్, అదనపు కలెక్టర్, జిల్లా పోలీసు అధికారి, వైస్ చైర్మన్ తదితరులు నిర్వహణ సభ్యులుగా వ్యవహరిస్తారు. ఇప్పటికే మండల కేంద్రాల్లో క్రీడలకు మైదానాల్లో కావాల్సిన ఏర్పాట్లను ఆయా మండలాల అధికారులు ఏర్పాట్లు చేశారు. మండలంలోని క్రీడాకారులు సీఎం కప్ టోర్నమెంట్‌లో పాల్గొని విజయవంతం చేయాలని సీఎం కప్ చైర్మన్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి కోరారు.
Read Also:Good News: ఇక నుంచి సర్కార్ బడుల్లో ఉదయం టిఫిన్ కూడా
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!