పోర్చుగల్ ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డ్ కు కార్లంటే పిచ్చి. తన గ్యారేజీలో లెక్కకు మించిన కార్లు ఉన్నాయి. అయితే తాజాగా దాదాపు రూ. 70 కోట్ల విలువైన బుగాట్టి కారులో క్రిస్టియానో రొనాల్డ్ చక్కర్లు కొట్టడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటలీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బుగాట్టి.. సెంటోదియాచీ పేరుతో లిమిటెడ్ ఎడిషన్ కారును మార్కెట్ లోకి విడుదల చేసింది. దీని ఖరీదు 80 లక్షల యూరోలు. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 71 కోట్లు. తాజాగా ఈ కారులో తన పార్ట్ నర్ జార్జినా రోడ్రిగ్స్ తో కలిసి రొనాల్డ్ రెస్టారెంట్ కు వెళ్లాడు. డిన్నర్ అనంతరం బయటికి రొనాల్డ్ బుగాట్టి కారు ఎక్కడం చూసి స్థానిక అభిమానులు ఫోటోలు క్లిక్ మనిపించారు. ఒక వ్యక్తి ఇదంతా తన ఫోన్ లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
https://twitter.com/TimelineCR7/status/1641056962208059393
Also Read : Sri Rama Navami Celebrations: శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి
ఈ వీడియోను రొనాల్డ్ కూడా రీట్వీట్ చేశాడు. గతేడాది ఇదే రెస్టారెంట్ ఒక రోల్స్ రాయిస్ కారులో రొనాల్డ్ కనిపించాడు. ఆ కారును జార్జినానే రొనాల్డ్ కు క్రిస్మస్ గిఫ్ట్ గా ఇచ్చారు. మరి ఖరీదైన బుగాట్టిని రొనాల్డ్ కొన్నాడా లేక గిఫ్ట్ గా వచ్చిందా అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. 2024లో యూరోపియన్ ఛాంపియన్ షిప్ క్వాలిఫయింగ్ కోసం రోనాల్డ్ తన సొంతజట్టు పోర్చుగల్ తరపున ఆడుతున్నాడు. ఇక జట్టు తరపున తొలి రెండు మ్యాచ్ లు కలిపి నాలుగు గోల్స్ చేసిన రొనాల్డ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
Also Read : Viral Video: థియేటర్ యాజమాన్యం నిర్వాకం.. టికెట్ ఉందని ప్రాధేయపడినా.. వీడియో వైరల్
పోర్చుగల్ తన తర్వాతి రెండు క్వాలిఫయింగ్ మ్యాచ్ లను జూన్ లో ఆడనుంది. ప్రస్తుతం గ్రూప్ జేలో పోర్చుగల్ టాప్ ప్లేస్ లో ఉంది. ప్రస్తుతం హాలిడే మూమెంట్ ను రొనాల్డ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఏప్రిల్ మొదటి వారంలో అల్-నసర్ క్లబ్ తో కలవనున్నాడు. ఏప్రిల్ 5న అల్-నసద్ క్లబ్.. అల్ అదాలాతో జరిగే మ్యాచ్ లో క్రిస్టియానో రొనాల్డ్ ఆడనున్నాడు.