Pakistan: పాకిస్తాన్ ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అయితే, ఇప్పుడు ఆర్థిక సంక్షోభానికి అనుగుణంగా పాక్ ప్రజలు మరో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. పాక్ కుటుంబాలు తమ ఆదాయంలో మూడింట రెండు వంతుల్ని ఆహారం, విద్యుత్ వంటి వాటికే చెల్లించాల్సి వస్తోంది. దీని కారణంగా విద్య, ఆరోగ్యం, దీర్ఘకాలిక అవసరాలకు ఖర్చు చేయలేని పరిస్థితి ఏర్పడిందని కొత్త ప్రభుత్వ సర్వే తెలియజేస్తోంది.
Pakistan: ఆపరేషన్ సిందూర్ సమయంలో వింత ప్రకటనలతో ట్రోలింగ్‌కి గురైన పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ప్రస్తుతం, పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సుల్లో చాలా వరదలు వస్తున్నాయి. అయితే, ఈ పరిస్థితుల్లో వరదలకు ఒక విచిత్రమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే పాకిస్తానీలు వరద నీటిని కాలువల్లోకి వెళ్లనివ్వకుండా కంటైనర్లలో ‘‘నిల్వ’’ చేయాలని ఆయన కోరారు. ఇదే కాకుండా ‘‘వరం’’గా చూడాలని కూడా ఆయన ప్రజల్ని కోరడం గమనార్హం.