Today Business Headlines 16-12-22: హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ 5జీ సర్వీసులు: హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కాకపోతే కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో మాత్రమే ఈ సర్వీసులు లభిస్తాయని పేర్కొంది. మెట్రో రైల్ మరియు రైల్వే స్టేషన్లు, పెద్ద బస్టాండ్ వంటి ప్రధాన రవాణా ప్రదేశాల్లో పొందొచ్చని తెలిపింది. అన్ని రకాల 5జీ ఫోన్లలో సిమ్ కార్డ్ మార్చాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం ఉన్న 4జీ సిమ్‌తోనే ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు.
Top Brands: మన దేశంలో బిస్కెట్లు తినేవారికి, పాలు తాగేవారికి పార్లే, అమూల్, బ్రిటానియా కంపెనీల ప్రొడక్టులు బాగానే పరిచయం. ప్రతిఒక్కరూ ఈ మూడింటిలో కనీసం ఒక కంపెనీ ప్రొడక్ట్ అయినా కొంటారు. ఇండియాలోని ఫాస్ట్ మూవీంగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ) రంగంలో