Top Brands: మన దేశంలో బిస్కెట్లు తినేవారికి, పాలు తాగేవారికి పార్లే, అమూల్, బ్రిటానియా కంపెనీల ప్రొడక్టులు బాగానే పరిచయం. ప్రతిఒక్కరూ ఈ మూడింటిలో కనీసం ఒక కంపెనీ ప్రొడక్ట్ అయినా కొంటారు. ఇండియాలోని ఫాస్ట్ మూవీంగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ) రంగంలో ఎక్కువ మంది ఎంచుకునేది ఈ మూడు బ్రాండ్లే. కాంతర్ రిపోర్ట్-2021లో ఇవి టాప్-3లో నిలిచాయి. కన్జ్యూమర్ రీచ్ పాయింట్ల(సీపీఆర్)ను బట్టి ఈ ర్యాంక్‌లను కేటాయించారు. ఈ లిస్టులో పార్లే సంస్థ గత పదేళ్ల నుంచి టాప్-1లో కొనసాగుతుండటం విశేషం. పార్లే పొందిన పాయింట్లు 6531 మిలియన్లు. 5561 మిలియన్ పాయింట్లతో అమూల్ 2వ స్థానంలో ఉంది. 5370 మిలియన్ పాయింట్లతో బ్రిటానియా 3వ స్థానాన్ని ఆక్రమించింది.
OPPO Company: చైనా కంపెనీ ‘ఒప్పొ’ చూపు.. ఇండియా వైపు. రూ.475 కోట్ల పెట్టుబడి
మరో ముగ్గురు మహిళా సంపన్నులు
మన దేశంలో అత్యంత సంపన్న మహిళల జాబితాలో మరో ముగ్గురు చోటు సంపాదించారు. వాళ్లే.. దివ్యా గోకుల్‌నాథ్, రుచి కల్రా, నేహా బన్సాల్. కొటక్ హురున్ రూపొందించిన జాబితాలో వీళ్లు ‘స్టార్టప్‌ల వ్యవస్థాపకుల కేటగిరీ’లో టాప్-3 స్థానాలను ఆక్రమించారు. తద్వారా.. సొంత వ్యాపారంపై ఆసక్తి ఉన్నోళ్లకు ఈ ముగ్గురూ ఆదర్శంగా నిలిచారు. దివ్యా గోకుల్‌నాథ్.. బైజూస్ కోఫౌండర్‌గా ఫేమస్‌గా కాగా ఆఫ్‌బిజినెస్, ఆక్సీజో అనే రెండు యూనికార్లను భర్తతో కలిసి ప్రారంభించి రుచి కల్రా ఈ ఫీట్ సాధించారు. “లెన్స్‌కార్ట్” కోఫౌండర్‌గా నేహా బన్సాల్ అందరికీ పరిచయమున్న వ్యక్తే కావటం గమనార్హం.
సన్ ఫార్మా లాభం రూ.2061 కోట్లు
సన్ ఫార్మా కంపెనీ లాభం ఏడాది కాలంలో 43% పెరిగింది. ఈ మేరకు ఆ సంస్థ జూన్ త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలోని మొదటి మూడు నెలలతో పోల్చితే ఈసారి రూ.2061 కోట్ల అధిక లాభాన్ని ఆర్జించింది. కంపెనీ రెవెన్యూ 11 శాతం పెరిగింది. 2021లో సంస్థ ఆదాయం రూ.9719 కోట్లు మాత్రమే కాగా ఈసారి రూ.10,762 కోట్లకు చేరింది.