అరగంట పాటు కురిసిన కుండపోత వర్షానికి గురుగ్రామ్‌లోని అత్యంత విలాసవంతమైన ప్రాంతం అతలాకుతలం అయింది. మోకాలు లోతు నీళ్లతో ధనవంతులు నానా ఇబ్బందులు పడ్డారు. సెప్టెంబర్ 4, బుధవారం రోజున కేవలం 30 నిమిషాల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది.
దేశ రాజధాని ఢిల్లీలో సృష్టించిన వర్ష బీభత్సం ఆనవాళ్లు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. గురు, శుక్రవారాల్లో కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలం అయింది. వాగులు, వంకలు ఏకమై ప్రవహించాయి.