Delhi Airport: దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు దట్టంగా కమ్మేసింది. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా పలు చోట్ల విజిబిలిటీ మందగించింది. పొగమంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయంలో రన్‌వే విజువల్ రేంజ్(ఆర్‌వీఆర్)ని పొగమంచు ప్రభావితం చేస్తుందని ఐఎండీ తెలిపింది. దీంతో విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లపై తీవ్ర ప్రభావం పడుతోంది. సోమవారం ఉదయం 9.45 గంటల వరకు రన్ వే విజిబిటిలీ 500 మీటర్ల కంటే ఎక్కువగా ఉంది.