గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే ఈ విమానం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. తాజాగా.. విమానం కూలిపోయిన ప్రదేశం నుంచి బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. ఓ పోలీసు అధికారి వ్యాఖ్యలను ఉటంకిస్తూ వెల్లడించింది.
అహ్మదాబాద్‌లో నిన్న కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం శిథిలాల నుంచి గుజరాత్ ఏటీఎస్ ఓ డిజిటల్ వీడియో రికార్డర్ (DVR)ను స్వాధీనం చేసుకుంది. ఏటీఎస్ సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి దానికి తీసుకెళ్తున్నట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. అంశంపై అతడిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. "ఈ డీవీఆర్‌ని శిథిలాల నుంచి మేము స్వాధీనం చేసుకున్నాం. ఎఫ్ఎస్ఎల్ బృందం త్వరలో ఇక్కడికి వస్తుంది." అని సమాధానం ఇచ్చారు.
ఫాల్కన్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారిక ప్రకటన చేసింది. ఈ కేసులో ఈడీ సంచలన విషయాను వెల్లడించింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో చార్టర్డ్ ఫ్లైట్ ని సీజ్ చేసామని ఈడీ అధికారులు వెల్లడించారు. దుబాయ్ నుంచి వచ్చిన ఫ్లైట్ ని ఎయిర్ పోర్టులో స్వాధీన పరచుకున్నామన్నారు. ఫాల్కన్ కేసులో ప్రధాన నిందితుడు అమర్ దీప్ అమెరికాకు చెందిన కంపెనీ పేరు మీద చార్టెడ్ ఫైట్ ని కొనుగోలు చేశాడన్నారు. Also Read:Child Trafficking…
ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఫ్లైట్‌ను ఈడీ సీజ్ చేసింది. 4 గంటల పాటు ఫ్లైట్‌ను చుట్టుముట్టి అందులో ఉన్న వాళ్లను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ స్కాం కేసులో నిందితులు ఇదే ఫ్లైట్‌లో దుబాయ్ కి పారిపోయారు.