నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గ అధికార పార్టీ బీఆర్‌ఎస్‌లో నెలకొన్న వర్గ విభేదాలు భగ్గు మన్నాయి. ఇవాళ జరగాల్సిన నిడమనూరు మార్కెట్ చైర్మన్ ప్రమాణస్వీకారానికి ముందే ఏర్పాటు ఫెక్సీలను చింపుకొని వీధిన పడ్డారు. రోడ్ల పైనే పరస్పరం వాగ్వివాదాలకు దిగడం కలకలం రేపింది.