బుధవారం ఐసీసీ బ్యాట్స్‌మెన్ టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. అందులో టీమిండియా స్టార్ ప్లేయర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్.. నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. కాగా.. ఇంతకుముందు నెంబర్ వన్ స్థానంలో ఉన్న పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు.. టాప్-10లో టీమిండియా ఆటగాళ్లు ఇద్దరు చోటు దక్కించుకున్నారు. మరొక బ్యాటర్ యశస్వీ జైస్వాల్.. అతను ఆరో స్థానంలో ఉన్నాడు.
ఏపీ సీఎం జగన్ రికార్డు సృష్టించారు. దేశంలోనే బెస్ట్ సీఎంగా వరుసగా రెండోసారి నిలిచి అరుదైన ఘనత సాధించారు. స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో భాగంగా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ – 2022 ఫలితాలను వెల్లడించగా… ఈ ఏడాది కూడా ఉత్తమ సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలిచారు. విభజన అనంతరం రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్న క్రమంలో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ జాబితాలో రెండో బెస్ట్ సీఎంగా పశ్చిమ బెంగాల్ సీఎం…
తెలంగాణ రాష్ట్రం మరో అరుదైన ఘనత సాధించింది. బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రాలలో దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక ప్రకారం… ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ (ODF) విషయంలో తెలంగాణ 96.74 శాతంతో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ తర్వాతి స్థానంలో తమిళనాడు (35.39 శాతం), కేరళ (19.78 శాతం), ఉత్తరాఖండ్ (9.01 శాతం), హర్యానా (5.75 శాతం), కర్ణాటక (5.59 శాతం), ఆంధ్రప్రదేశ్ (4.63 శాతం) ఉన్నాయి. జమ్మూకశ్మీర్, బీహార్,…