భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకా 'ఇన్‌కొవాక్'ను బూస్టర్ డోస్‌గా వినియోగించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత అనుమతి ప్రకారం ఇప్పటివరకు రెండు డోసుల కొవాగ్జిన్ లేదా కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారు 6నెలల తర్వాత బూస్టర్ డోస్‌గా ఈ చుక్కల మందు టీకా తీసుకోవచ్చు.