ఏపీ ఫైబర్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఇటీవలే మాట్లాడుతూ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అనే కొత్త ప్రోగ్రాం ని లాంచ్ చేస్తున్నట్లు తెలిపాడు. ఈ ప్రోగ్రామ్ లో మొదటి రోజు నుంచే సినిమాలని టీవీల్లో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనున్నారు. దీంతో పల్లెల్లో ఉన్న వాళ్లు సినిమా చూడడానికి టౌన్ వరకు రావాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొనే రీఛార్జ్ చేసుకోని సినిమా చూడొచ్చు అని చెప్పాడు. ఈ ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రోగ్రామ్ పై…
ప్రతిష్టాత్మక పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మూడో తరం ఇప్పుడు చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఏడిద నాగేశ్వరరావు మనవరాలు, నటుడు శ్రీరామ్ కుమార్తె శ్రీజ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ పేరుతో ఓ సినిమాను నిర్మిస్తోంది. ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంచ్ చేసి…
తెలుగు చిత్రసీమలో పూర్ణోదయ సంస్థకు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. నాటి ‘తాయారమ్మ బంగారయ్య’ నుంచి ‘ఆపద్భాందవుడు’ వరకూ పలు క్లాసికల్ చిత్రాలను నిర్మించిన ఘనత ఈ సంస్థది. ‘శంకరాభరణం, సితార, సాగరసంగమం, స్వాతిముత్యం, స్వయంకృషి’ వంటి సినిమాలు ఆ సంస్థ నుంచి వచ్చినవే. ఇప్పుడు ఈ సంస్థ 30 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇవ్వనుంది. పూర్ణోదయ అధినేత ఏడిద నాగేశ్వరరావు కుమారుడు ఏడిద శ్రీరామ్ సమర్పణలో మనవరాలు శ్రీజ ఏడిద నిర్మాతగా ‘జాతి రత్నాలు’…