ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి క్రమేపీ పెరుగుతోంది.
గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. ముఖ్యంగా తూగో జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర క్రమేపి గోదావరి వరద నీటిమట్టం పెరిగిపోతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి వరద ఉధృతి ఉంది.