Virat Kohli: క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అంటేనే రికార్డుల రారాజు. అయితే గత కొంతకాలంగా సెంచరీలకు దూరంగా ఉన్న కోహ్లీ ఇటీవల ఆసియా కప్‌లో ఆప్ఘనిస్తాన్ మ్యాచ్‌లో చెలరేగి సెంచరీ దాహాన్ని తీర్చుకున్నాడు. కెరీర్‌లో 71వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు సోషల్ మీడియాలోనూ కోహ్లీ క్రేజ్ మరింత పెరుగుతోంది. తాజాగా ట్విట్టర్‌లో ఫాలోవర్ల విషయంలో విరాట్ కోహ్లీ 50 మిలియన్ (5 కోట్లు) మార్కును చేరుకున్నాడు. ఈ రికార్డును అందుకున్న తొలి క్రికెటర్ విరాట్ కోహ్లీనే…