గెలిచే సత్తా లేక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తప్పుడు కూతలు కూస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. గత ఎన్నికల్లో టీడీపీ 23, జనసేన ఒకటి గెలుచుకున్నారని.. ఈసారి ఒకటి కూడా గెలవలేరని మంత్రి తెలిపారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రుషికొండను పరిశీలించారు. దూరం నుంచే కొండను పరిశీలించిన పవన్.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం, రుషికొండ నిర్మాణాలపై తీవ్ర విమర్శలు చేసారు. తట్టెడు మట్టి తీస్తేనే పర్యావరణ ఇబ్బందులు వచ్చే చోట విధ్వంసం చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయం కోసమే అయితే సర్క్యూట్ హౌస్, ఇతర చోట్ల కట్టవొచ్చు కదా అని జనసేనాని ప్రశ్నించారు.
Eden Gardens dressing room catches fire during renovation work of World Cup 2023: భారత దేశంలోని ప్రముఖ క్రికెట్ స్టేడియంలో ఒకటైన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకొంది. మెగా టోర్నీ ప్రపంచకప్ 2023 కోసం మరమ్మత్తు పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో మంటలు చెలరేగాయి. వీటిని గమనించిన సిబ్బంది వెంటనే ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన…
ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. త్వరలోనే ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు. అంతేకాకుండా కేంద్రంలో ఏ ప్రభుత్వం రావాలన్న సీఎం కేసీఆర్ మద్దతు తప్పనిసరి అని కీలక వ్యాఖ్యలు చేశారు.
చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. చంద్రయాన్-3కి సంబంధించి ప్రతి భారతీయుడు గర్వంతో పొంగిపోతున్నాడు. అయితే ప్రస్తుతం చంద్రయాన్‌కు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది.
హౌరా నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాదానికి గురికావడంతో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు రెండు రైళ్లను క్యాన్సిల్ చేశారు. మరో నాలుగు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్-రేపల్లె, సికింద్రాబాద్-మన్మాడ్ ట్రైన్స్ ను క్యాన్సిల్ చేసినట్లు వెల్లడించారు. ఇక, సికింద్రాబాద్-తిరువనంతపురం శబరి ఎక్స్‌ప్రెస్‌ను (వయా కాజీపేట, విజయవాడ), సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (వయా కాజీపేట, విజయవాడ) గుంటూరు వెళ్లే రైళ్లు కాజీపేట మీదుగా వెళ్లేందుకు క్లియరెన్స్ ఇచ్చారు.
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 8వ తారీఖున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చే ముందు రూ. 1000 కోట్లు లేదా రూ.2 వేల కోట్ల ప్యాకేజ్ ఇచ్చి అప్పుడు రాష్ట్రానికి రావాలి అని మంత్రి డిమాండ్ చేశారు.
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఫైరయ్యారు. ఒక కేసు తరువాత మరొక కేసుతో తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని ప్రధాని మోడీపై ఆర్‌జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు.
Attack On Indian Consulate: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో ఉన్న భారత కాన్సులేట్‌పై దాడి ఘటన వెలుగు చూసింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున 1.30 నుండి 2.30 గంటల వరకు జరిగింది.