Ambulance Blast: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఓ గర్భిణి, ఆమె కుటుంబ సభ్యులు తృటిలో బయటపడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. గర్భిణిని, ఆమె కుటుంబాన్ని ఎరండోల్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి జల్గావ్ జిల్లా ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా దాదా వాడి ప్రాంతంలోని జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్‌పై ఈ ఘటన జరిగింది. ఉన్నటుండి…