మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. నాగార్జున సాగర్ లో రఘునందన్ రావుపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2021లో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మోడల్ కోడ్ అమల్లో ఉండగా అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారని ఫిర్యాదు చేశారు. ఉట్లపల్లి, పులిచెర్ల గ్రామాల్లో ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ఎంపీడీవో దుబ్బ సత్యం ఫిర్యాదు మేరకు రఘునందన్ పై కేసు నమోదైంది. ఈ కేసును తాజాగా…