ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ వచ్చిన సమంత ఇప్పుడు పూర్తిగా సినిమాలు తగ్గించింది. ఆమె ప్రస్తుతానికి నెట్ఫ్లిక్స్ కోసం రక్త బ్రహ్మాండ్ అనే ఒక ఫాంటసీ సిరీస్ లో నటిస్తోంది. అయితే ఈ సిరీస్ ప్రస్తుతానికి ఆర్థిక ఇబ్బందుల కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. Also Read:Venkatesh: ఏకంగా 3 సినిమాలు లైన్లో పెట్టిన వెంకీ మామ? తాజాగా ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ తెరమీదకు రావడంతో అసలు ఈ ప్రాజెక్టు ముందుకు వెళుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ…
ఆ వ్యక్తి వయసుల 70 ఏళ్లు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. కృష్ణా రామా అనుకుంటూ ఇంట్లో కూర్చోవాల్సిన ఈ వయసులో దుర్భుద్ధి ప్రవేశపెట్టాడు. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి 38.73లక్షలు పోగొట్టుకున్నాడు. ఇంతకీ ఏం చేశాడంటే.. హైదరాబాద్ కి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి(70)ని హనీ ట్రాప్‌లో ఇరికించి రూ. 38.73లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్ళు.
Cyber Fraud : సైబర్ నేరాలు రోజురోజుకూ మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. ఆధునిక సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ నిత్యం కొత్త రూపాల్లో మోసాలు చేస్తూ ప్రజలను దోచేస్తున్న సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు మరో స్థాయికి వెళ్లారు. తాజాగా సుప్రీం కోర్టు జడ్జి పేరు వినిపిస్తూ నకిలీ కోర్టు డ్రామాతో ఓ రిటైర్డ్ ఇంజనీర్‌ను మోసం చేసిన ఘటన సంచలనం రేపుతోంది. హైదరాబాద్ వనస్థలిపురం ప్రాంతానికి చెందిన ఓ మాజీ చీఫ్ ఇంజనీర్‌కు ఓ వీడియో కాల్ వచ్చింది.…
ఫాల్కన్ స్కాం కేసులో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో సీఐడీ మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. తెలంగాణ సీఐడీ బీహార్ లో ఇద్దరిని అరెస్ట్ చేసింది. పట్టుబడ్డ ఇద్దరు నిందితులు A2 అమర్ దీప్ కుటుంబ సభ్యులు. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కాంలో నేరస్థులుగా ఉన్నారని..
పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్న లోన్ యాప్ ముఠా అరెస్టు చేశారు. రూ. 200 కోట్ల రూపాయల లావాదేవీలు పోలీసులు గుర్తించారు. లోన్ యాప్ ల ద్వారా ఆర్థిక నేరాలకి పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడుతో సహా 9 మంది అరెస్ట్ అయ్యారు. రూ. 2 వేల రూపాయలు లోన్ యాప్ లో అప్పు తీసుకున్న నరేంద్ర అనే యువకుడిని వేధించిన కేసులో పురోగతి లభించింది. నరేంద్ర భార్య ఫొటోలను…
Betting Apps :బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులన్నింటినీ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)కు బదిలీ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు సమాచారం అందిస్తూ, ఇప్పటికే పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదై ఉన్నాయని స్పష్టం చేశారు. నెలలుగా పెద్ద దందాగా మారిన బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా, ఇప్పటివరకు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో…
IT Raids : ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో భారీగా ఆదాయపు పన్ను (ఐటీ) అధికారుల సోదాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పేరుగాంచిన క్రేన్ వక్కపొడి కంపెనీ కార్యాలయాలు, చైర్మన్ కాంతారావు నివాసంతో పాటు అతని బంధువుల ఇళ్లలో ఐటీ శాఖ దాడులు చేపట్టింది. రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు బయటపడుతున్నాయి. ఈ దాడులలో ఇప్పటి వరకు 40 కేజీల బంగారం.. 100 కేజీల వెండి.. 18 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా,…
Falcon Scam Case: ఫాల్కన్ కేసు విషయంపై ఎన్టీవీతో ప్రత్యేకంగా ఈఓడబ్ల్యూ డీసీపి ప్రసాద్ మాట్లాడారు. 2021 నుండి డిపాజిట్లు వసూలు చేస్తున్నారని, ఫాల్కన్ ఇన్ వాయిస్ డిస్కౌంట్ ప్లాట్ ఫాం పేరుతో డిపాజిట్లు తీసుకున్నారని ఆయన అన్నారు. ఈ కేసులో కావ్య, పవన్ లను అరెస్టు చేశామని, ప్రధాన నిందితుడు అమీర్ దీప్ తో పాటు సురేందర్ మరికొంత మంది పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. నిందితులపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశామని, విదేశాలకు…
Fraud : నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తిలో అధిక వడ్డీల పేరుతో మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అమాయక ప్రజలను మోసం చేసిన కల్వకుర్తికి చెందిన ముజమ్మిల్ అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నారు పోలీసులు. కోట్ల రూపాయలతో పరారయ్యాడు నిందితుడు. అమాయక ప్రజలను అధిక వడ్డీ ఇస్తానని ఆకర్షించిన ముజమ్మిల్.. 2020లో ఆర్ సి ఇన్ఫ్రా, ట్రై కాలర్ పేరుతో వెంచర్లు పెట్టి అధిక వడ్డీ ఇస్తానని వ్యాపారం ప్రారంభించాడు. 24 మంది ఏజెంట్లతో…
Fraud Case: ప్రధాని నరేంద్ర మోదీ కార్యదర్శి పీకే మిశ్రా పేరు వాడుతూ అడ్డదారిలో కోట్లు సంపాదించేందుకు ప్రయత్నించిన ఓ జంట అరెస్టు అయింది. ఒడిశా పోలీసులు హన్సితా అభిలిప్సా, అనిల్ మహంతి అనే దంపతులను అరెస్టు చేసారు పోలీసు అధికారులు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఇన్ఫోసిటీ ప్రాంతంలో విలాసవంతమైన కార్యాలయం నిర్వహిస్తూ.. హన్సితా అభిలిప్సా, అనిల్ మహంతి జంట ప్రధాన మంత్రి కార్యదర్శి పీకే మిశ్రా కుటుంబ సభ్యులుగా పరిచయం చేసుకునేవారు. ముఖ్యంగా మైనింగ్, నిర్మాణ…