PM Modi to launch 75 digital banking units across 75 districts: దేశంలో ఆర్థిక లావాదేవీలను ప్రజలకు మరింతగా చేరువ చేసే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం రోజున 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను(డీబీయూ) ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో వీటిని ప్రారంభించనున్నారు. కొత్తగా ప్రారంభిస్తున్న డీబీయూలను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
Finance Minister Nirmala Sitharaman Comments On CM KCR: నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూ. 38,500 కోట్లతో ప్రారంభమై అదనంగా లక్షా 25 వేల కోట్లకు పెంచారని విమర్శించారు. తెలంగాణ అప్పుల గురించి అడగటానికి కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో అప్పుడే…
కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ మధ్య పూర్తి సామరస్యం, సరైన అవగాహన ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. క్రిప్టో కరెన్సీ సహా అన్ని అంశాలపై కేంద్రం, RBI ఒకే మాటపై ఉన్నాయని చెప్పారు. ఒక వ్యవస్థ పట్ల మరో వ్యవస్థకు పరస్పర నమ్మకముందన్నారు నిర్మల. జాతీయ ప్రయోజనాలు, ప్రాధాన్యాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామన్నారు. రిజర్వ్ బ్యాంక్ బోర్డ్ మీటింగ్ తర్వాత గవర్నర్ శక్తికాంత దాస్ తో కలసి మీడియా ముందుకొచ్చిన నిర్మల… ప్రతీ విషయంలోనూ……
బడ్జెట్ 2022కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నిర్మల వరుసగా నాలుగో ఏడాది బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇలా వరుసగా నాలుగేళ్లు పార్లమెంట్‌లో పద్దు ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ కే దక్కింది. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ 1970లో ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహిళ నిర్మల. ఇప్పడు ఆమె…
ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా నాలుగోసారి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత ఏడాది తరహాలో ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ బడ్జెట్‌నే ప్రవేశపెట్టనుంది. మరోవైపు బడ్జెట్‌ను చూడాలనుకునే వారి కోసం కేంద్ర ప్రభుత్వం యూనియన్ బడ్జెట్ అనే పేరుతో మొబైల్ యాప్‌ను రూపిందించింది. ఈ యూనియన్ బడ్జెట్ యాప్ ద్వారా బడ్జెట్ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.…
కరోనా విలయం సృష్టించింది.. మరోసారి ఉగ్రరూపం దాల్చి ఎటాక్ చేస్తోంది.. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బకొట్టింది.. సామాన్యులు జీవనమే కష్టంగా మారిపోయింది.. అయితే, ఈ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కీలక సూచనలు చేశారు బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి.. ఏ విషయం అయినా కుండ బద్దలు కొట్టినట్టుగా.. సూటిగా మాట్లాడే ఆయన.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఈ సమయంలో మీరు ఆర్థిక మంత్రిగా ఉండి ఉంటే ఏం చేసేవారు?…
బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఎప్పుడూ తీవ్రమైన పోటీయే ఉంటుంది.. ఇక, ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ) ఉద్యోగాలకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అయితే.. ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీగా ఖాళీలు ఉన్నాయి.. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు… ప్రభుత్త గణాంకాల ప్రకారం.. ఈ నెల 1వ తేదీ నాటికి దేశ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41,177 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు పేర్కొన్నారు నిర్మలా సీతారామన్..…
దేశంలో కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా పుంజుకుంటోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అక్టోబర్ నెలకు సంబంధించి కేంద్రం ప్రకటించిన జీఎస్టీ వసూళ్ల వివరాలను చూస్తే ఈ విషయంపై క్లారిటీ వస్తుంది. అక్టోబరులో దేశవ్యాప్తంగా రూ.1,30,127 కోట్ల జీఎస్టీ వసూళ్లు వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రకటించారు. ఈ వసూళ్లలో సీజీఎస్టీ వసూళ్లు 23,861 కోట్లు కాగా ఎస్‌జీఎస్టీ వసూళ్లు 30,421 కోట్లు. ఐజీఎస్టీ కింద రూ.67,361 కోట్లు వచ్చాయి.…
భారత్‌లో త్వరలోనే విద్యుత్ సంక్షోభం రాబోతోంది.. దానికి ప్రధాన కారణం బొగ్గు కొరతే అనే వార్తలు గుప్పుమన్నాయి.. దానికి తగినట్టుగా కేంద్రం.. రాష్ట్రాలను అలర్ట్ చేయడం.. బొగ్గు కొరతపై ప్రకటన చేయడం.. విద్యుత్ సంక్షోభానికి దారితీసి నాలుగు పరిణామాలు ఇవేనంటూ ప్రకటించడం జరిగిపోయాయి.. అయితే, బొగ్గు కొరత ఉందంటూ వస్తులను వార్తలను కొట్టిపారేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఆ వార్తలు పూర్తిగా నిరాధారం అని క్లారిటీ ఇచ్చిన ఆమె.. భారత్ మిగులు విద్యుత్ గల…
పెట్రో ధరలు దేశవ్యాప్తంగా సామాన్యులకు భారంగా మారిపోయాయి.. క్రమంగా ఆ ధరల ప్రభావం అన్ని వస్తువులపై పడుతూనే ఉంది.. అయితే, పెట్రోల్, డీజిల్‌లపై దిగుమతి సుంకాలను తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఇదే సమయంలో.. ఏడేళ్ల క్రితం అధికారంలో ఉన్న యూపీఏ సర్కార్‌పై దుమ్మెత్తిపోస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలను కృత్రిమంగా తగ్గించేందుకు కేంద్ర చమురు సంస్థలకు కాంగ్రెస్ పాలిత యూపీఏ ప్రభుత్వం బాండ్లను…