బడ్జెట్ 2022కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నిర్మల వరుసగా నాలుగో ఏడాది బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇలా వరుసగా నాలుగేళ్లు పార్లమెంట్‌లో పద్దు ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ కే దక్కింది. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ 1970లో ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహిళ నిర్మల. ఇప్పడు ఆమె వరుసగా నాలుగోసారి బడ్జెట్ పెడుతూ ఎవరికీ దక్కని ఘనతను సొంతం చేసుకున్నారు. కాగా ఇప్పటి వరకు ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు మొరార్జీ దేశాయ్ 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత చిదంబరం, ప్రణబ్‌ముఖర్జీ 9 సార్లు, యశ్వంత్‌రావు చౌహాన్, సీడీదేశ్ ముఖ్ 7 సార్లు, టీటీ కృష్ణమాచారి, మన్మోహన్ సింగ్ 6 సార్లు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
Read Also: అభయ హస్తం పథకాన్ని తిరిగి ప్రారంభించాలి..వైఎస్ షర్మిల డిమాండ్