Gussadi Kanakaraj: గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుస్సాడీ నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయటంతో పాటు తెలంగాణ కళలను, సంస్కృతి సంప్రదాయాలను కాపాడిన కనకరాజు అసామాన్యుడు.. ఆయన మరణం తీరని లోటని తెలిపారు.
చిరకాల మిత్రుడు అకస్మాత్తుగా కన్నుమూస్తే ఆ బాధ మామూలుగా వుండదు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో తన చిరకాల మిత్రుడు ఆకస్మికంగా మృతి చెందటంతో నివాళులు అర్పించి అంతిమయాత్రలో పాల్గొని పాడే మోసి కడవరకు సాగనంపారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. సత్తుపల్లి పట్టణ ప్రముఖులు సత్తుపల్లి మాజీ ఉపసర్పంచ్, మాజీ కౌన్సిలర్ తుళ్లూరు ప్రసాద్ గుండెపోటుతో మృతి చెందారు. తుళ్లూరు ప్రసాద్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి సన్నిహితులు. ఇద్దరూ ఎంతో స్నేహంగా మెలిగేవారు.…
మనది లౌకిక రాజ్యం. మనదేశంలో ఎన్నో మతాలు, ఎన్నో జీవన విధానాలు. హిందువుల పండుగల్లో ముస్లింలు, రంజాన్ ఇఫ్తార్ విందుల్లో అన్ని మతాల వారు పాల్గొని తమ ప్రత్యేకతను చాటుకుంటూ వుంటారు. వినాయకచవితి వేడుకల్లో ముస్లింలు పాల్గొంటూ వుంటారు. అలాగే హిందూ మతానికి చెందినవారు మరణిస్తే దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహిస్తూ వుంటారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు కొందరు ముస్లిం యువకులు. అనారోగ్యంతో ఓ మహిళ మృతి చెందగా ఆమె అంతిమ యాత్ర లో పాల్గొని దహన…
మన సంప్రదాయంలో ఎన్నో విశిష్టతలు వున్నాయి. చనిపోయింది మనిషైనా, చివరికి జంతువైనా దానికి అంతిమ సంస్కారాలు చేయడం పరిపాటి. చనిపోయిన ఒక వానరానికి అంత్యక్రియలు జరిపారు ఓ గ్రామస్తులు. చనిపోయింది కోతే కదా అని వదిలేయలేదు అక్కడి ప్రజలు. దానిని దైవస్వరూపంగా భావించి అత్యంత వైభవంగా అంతిమ యాత్ర నిర్వహించారు. గ్రామంలోని ప్రజలందరూ ఆ యాత్రలో పాల్గొనడం విశేషం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైలారం గ్రామంలో రోడ్డు ప్రమాదంలో ఓ వానరం మరణించింది. మనం…