Tollywood: ఆగస్ట్ 1 నుండి సినిమాల షూటింగ్స్ బంద్ చేయాలనే నిర్ణయానికి మద్దతు రోజు రోజుకూ పెరుగుతోంది. గత వారం రోజులుగా షూటింగ్స్ ఆపేసి, అందరూ కలిసి భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచించాలనే మాట బాగా వినిపిస్తోంది. అయితే కరోనా కారణంగా ఇప్పుడే కుదురుకుంటున్న టైమ్ లో తిరిగి షూటింగ్స్ ను బంద్ చేయడం కరెక్ట్ కాదని మరి కొందరు నిర్మాతలు చెబుతున్నారు.