సినీ కార్మికుల వేతన సవరణను తెలుగు చిత్రసీమ పట్టించుకోకపోవడంతో వాతావరణం వేడెక్కుతోంది. సినిమా కార్మికులతో ఇప్పటికే వేతన సవరణ ఒప్పందం చేసుకోవాల్సిన ఫిల్మ్ ఛాంబర్ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే సమయంలో తెలుగు నిర్మాత మండలి సైతం ఫెడరేషన్ సూచనలు, సలహాలను పక్కన పెట్టేసిందన్నది కార్మికుల ఆరోపణ. గతంలో తమతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయనందున ఫెడరేషన్ నేతల మాటను గౌరవించేది లేదని ఇటీవల జరిగిన కార్యవర్గ సమావేశంలో నిర్మాతల మండలి తేల్చి చెప్పేసింది.…