టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, ఏపీ మంత్రి పేర్నినానితో జరిపిన సమావేశం ముగిసింది. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్వహించిన ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, డీవీవీ దానయ్య, సి.కల్యాణ్, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు పాల్గొన్నారు. నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం నుంచి మంచి భరోసా లభించింది. ఆన్ లైన్ టిక్కెటింగ్ కావాలని మేమే అడిగాము. ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా సంతోషంగా ఉంది. సినిమా ఇండస్ట్రీకి ఊతం ఇచ్చారు’ అని సి.కళ్యాణ్ తెలిపారు. నిర్మాత…