ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో సాగుతున్న “మనం సైతం” సేవా సంస్థ మరో మైలురాయి దక్కించుకుంది. సొంత ఆంబులెన్స్ కలిగిన సేవా సంస్థగా ముందడుగు వేసింది. ఈ ఉచిత ఆంబులెన్స్ సేవల ప్రారంభ కార్యక్రమం హైదరాబాద్ ఫిలింనగర్ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సీబీఐ మాజీ డీజీ లక్ష్మీ నారాయణ, నిర్మాతలు సి కళ్యాణ్, దర్శకుడు వివి వినాయక్, కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు, నటి సన తదితరులు పాల్గొన్నారు. కాదంబరి…
తొందరపడి సినిమాలను ఓటీటీకి అమ్ముకోవద్దని నిర్మాతలకు తెలంగాణ ఎగ్జిబిటర్స్ సూచించారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్స్‌తో తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశం నిర్వహించింది. ఓటీటీ వేదికగా తమ సినిమాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న నిర్మాతలు జులై చివరినాటికి థియేటర్లు తెరచుకొనే అవకాశం ఉందని తెలిపారు. ఈలోగా ఓటీటీలకు సినిమాలు ఇవ్వొద్దని ఎగ్జిబిటర్లు తీర్మానించారు. అప్పటికీ థియేటర్లు తెరవకపోతే వారి ఆలోచనల ప్రకారం ఓటీటీలో సినిమాలు విడుదల చేసుకోవాలని కోరింది. నిర్మాతల మండలి నిర్ణయాన్ని…
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోని నాలుగు సెక్టార్స్ కు చెందిన సభ్యులకు, కార్యాలయ సిబ్బందికి, సినీ పాత్రికేయులకు బుధవారం ఉదయం నెల్లూరుకు చెందిన ఆనందయ్య మందును ఛాంబర్ మెంబర్, నిర్మాత ఇసనాక సునీల్ రెడ్డి అందచేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి కె.ఎల్. దామోదర్ ప్రసాద్, ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్ చైర్మన్ ఏలూరు సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ, ”మాది నెల్లూరు.…