ఈ రోజు జరిగిన ఫిలిం ఛాంబర్ జనరల్ బాడీ మీటింగ్‌లో కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగులు బంద్ కానున్నాయి. ఇప్పటికే రన్నింగ్‌లో ఉన్న సినిమా షూటింగ్‌లు కుడా జరగవు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్‌లను నిలిపివేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Film Nagar Cultural Center :ఫిలిమ్ నగర్ నడిబొడ్డున ఫిలిమ్ ఛాంబర్ కళకళలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. ఈ నాటికీ హైదరాబాద్ మహానగరంలో ఫిలిమ్ ఛాంబర్ ఓ ల్యాండ్ మార్క్ గా నిలచే ఉంది
కరోనా తర్వాత తెలుగు చిత్రపరిశ్రమ సాధారణ స్థితికి చేరుకోవడమే కాదు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపుతో చకాచకా ముందుకు సాగిపోతోంది. మన సినిమాకు ఇప్పుడు జాతీయంగానే కాదు అంతర్జాతీయంగా కూడా గుర్తింపు లభిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ఒక్కసారిగా కార్మికుల సమ్మెతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. మరి తెలుగు సినిమా ఎదుగదలలో తాము ఉన్నామని చాటిన సినీ కార్మికులు వేతనాల పెంపు కారణంతో సమ్మె చేయటానికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం… తెలుగు చిత్రపరిశ్రమకు సుప్రీం బాడీ ఫిలిమ్…
సినీ కార్మికుల వేతన సవరణను తెలుగు చిత్రసీమ పట్టించుకోకపోవడంతో వాతావరణం వేడెక్కుతోంది. సినిమా కార్మికులతో ఇప్పటికే వేతన సవరణ ఒప్పందం చేసుకోవాల్సిన ఫిల్మ్ ఛాంబర్ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే సమయంలో తెలుగు నిర్మాత మండలి సైతం ఫెడరేషన్ సూచనలు, సలహాలను పక్కన పెట్టేసిందన్నది కార్మికుల ఆరోపణ. గతంలో తమతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయనందున ఫెడరేషన్ నేతల మాటను గౌరవించేది లేదని ఇటీవల జరిగిన కార్యవర్గ సమావేశంలో నిర్మాతల మండలి తేల్చి చెప్పేసింది.…
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘అంటే సుందరానికీ…’ మూవీ ఈ నెల 10వ తేదీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో గ్రాండ్ వే లో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో 8వ తేదీ హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ప్లాన్ చేసి, భారీ స్థాయిలో దానిని నిర్వహించాలని నిర్మాతలు భావించారు. దానికి ఒక రోజు ముందు పవన్ కళ్యాణ్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా హాజరు కావడానికి…
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు నారాయణ్ కె. దాస్ నారంగ్ గారు సినీ ఇండస్ట్రీలో అజాత శత్రువు గా పేరొందారు . నైజాం లో ఎగ్జిబిటర్ మరియు పంపిణీదారులుగా విశేష సేవలందించారు .వారి మరణం విచారకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. కొడాలి నాని
బాలీవుడ్ మొదటి తరం హీరోల్లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన నటుడు పైడి జయరాజ్. సెప్టెంబర్ 28 ఆయన జన్మదినం. ఆ సందర్బంగా జయంతి వేడుకలు మంగళవారం ఫిలిం ఛాంబర్ లో జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ‘పైడి జయరాజ్ తెలంగాణ నటుడు. పలు కష్టనష్టాలకు ఓర్చి హీరోగా ఎదిగి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు…