భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు నెలలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 5 నుంచి 10 వరకు రాష్ట్రపతి ఆయా దేశాలను సందర్శించనున్నారు. ఆగస్టు 5-10 మధ్య ఫిజీ, న్యూజిలాండ్, తైమూర్-లెస్టేలో ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు.
Ram Mandir: అయోధ్య రామ మందిరాన్ని ఫిజీ దేశ ఉప ప్రధాని బిమన్ ప్రసాద్ గురువారం సందర్శించారు. అయోధ్య రాముడిని దర్శించుకున్న తొలి విదేశీ నేతగా ఫిజీ ప్రధాని నిలిచారు. గత నెల 22న అయోధ్యలో భవ్య రామ మందిరాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఫిజీలో భారతీయ ప్రవాసులకు ప్రాతినిధ్యం వహించిన ప్రతినిధి బృందానికి బియన్ ప్రసాద్ నాయకత్వం వహించారు.
Earthquake: ఓషియానియా దేశం అయిన ఫిజీలో భారీ భూకంపం సంభవించింది. శనివారం దక్షిణ పసిఫిక్ సముద్రంలోని ద్వీప దేశం అయిన ఫిజీలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతగా నమోదైందని యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. భూమికి 8 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.
ఫిజీలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రత నమోదైంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఫిజీ దక్షిణ పసిఫిక్‌లోని ఒక దేశం. ఇది 300 కంటే ఎక్కువ ద్వీపాలతో కూడిన ద్వీపసమూహం.
కరోనా మహమ్మారిని తరిమికొట్టాలి అంటే ఎకైక మార్గం వ్యాక్సిన్ ఒక్కటే. వ్యాక్సిన్ కోసం ప్రపంచంలోని అన్ని దేశాలు తమకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకొని ప్రజలకు అందిస్తున్నాయి. అయితే, మొదటి వేవ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొన్న దేశాలు, డెల్టావేరియంట్ కారణంగా సెకండ్ వేవ్ ను ఎదుర్కొంటున్నాయి. సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉంటుండటంతో దేశాలు లాక్‌డౌన్‌ను, వ్యాక్సిన్‌ను అందిస్తున్నాయి. ఏప్రిల్ వరకు ఫిజీ దేశంలో కంట్రోల్ ఉన్న కరోనా, డెల్టావేరియంట్ కారణంగా కేసులు పెరగడం మొదలుపెట్టాయి. …