Sankranti Rush : సాధారణంగా సంక్రాంతి పండుగకు ఏపీలో ఉండే సందడి అంతా ఇంతా కాదు. మూడు రోజుల పాటు కుటుంబ సభ్యులతో కలిసి సొంతూళ్లలో పండుగను ఘనంగా జరుపుకోవడానికి హైదరాబాద్ లాంటి నగరాల్లో స్థిరపడిన లక్షలాది మంది ప్రజలు సిద్ధమవుతుంటారు. అయితే, పండుగకు ఇంకా నెల రోజుల కంటే ఎక్కువ సమయం మిగిలి ఉన్నప్పటికీ, సొంతూళ్లకు వెళ్లాలనుకునే నగరవాసుల ప్రయాణ కష్టాలు మాత్రం ఇప్పటికే తారస్థాయికి చేరుకున్నాయి. ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సు ఛార్జీలతో పోలిస్తే…