విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు తప్పటడుగులు వేస్తున్నారు. కొందరు టీచర్లు తమ వికృత చేష్టలతో ఉపాధ్యాయ లోకానికి మాయని మచ్చగా మారుతున్నారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. తాజాగా గురుకుల విద్యార్థినిపై మహిళా వైస్ ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలోని ఓ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడింది వైస్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి. 10వ…