మహారాష్ట్రలో ఓ మహిళా వైద్యురాలి (26) ఆత్మహత్య సంచలనంగా మారింది. సతారా జిల్లా ఆస్పత్రిలోనే వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసిపెట్టింది. ఎస్ఐ గోపాల్ బడ్నే తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని ఆరోపించింది.
ముంబై ఆస్పత్రిలో ఓ కార్మికుడు నీచానికి పాల్పడ్డాడు. మహిళా డాక్టర్ స్నానం చేస్తుండగా కిటికీలోంచి మొబైల్ ద్వారా రికార్డ్ చేశాడు. గమనించిన బాధితురాలు కేకలు వేయడంతో బండారం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జయేష్ సోలంకిని పోలీసులు అరెస్ట్ చేశారు.