తమిళ యువ కథానాయకుడు శింబు కారణంగా ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (పెఫ్సీ), తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ (టి.ఎఫ్.సి.సి.) మధ్య అగ్గి రాజుకుంది. దానికి శింబు నటిస్తున్న ‘వెందు తనిందదు కాడు’ సినిమా కారణం. శింబు గతంలో నలుగురైదుగురు నిర్మాతలతో చేసుకున్న ఒప్పందాన్ని నెరవేర్చకుండానే ఈ కొత్త సినిమాకు డేట్స్ కేటాయించాడు. దాంతో వాళ్ళంతా నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. మరీ ముఖ్యంగా శింబులో ‘ట్రిపుల్ ఎ’ మూవీ నిర్మించిన మైఖేల్ రాయప్పన్…