ఈ సృష్టి విచిత్రం. బద్ధ శత్రువులు కూడా కలిసిపోతుంటారు. జంతువులు కూడా తమ జాతి వైరాన్ని మరిచి పోతుంటాయి. కుక్క-కోతి, పిల్లి-కుక్క, కుక్క-కోడి ఇలా అనేకం కలిసి మెలిసి జీవిస్తుంటాయి. అలాంటిదే ఇది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోట గ్రామంలోని గోమాత మేక పిల్లకు తల్లిగా ప్రేమను పంచి పెడుతోంది. తల్లి లేని మేక పిల్లకు గోమాత పాలిచ్చి లాలిస్తూ అక్కున చేర్చుకుంది. బతకల సవరయ్యకు చెందిన మేక పది రోజుల క్రిందట మేక పిల్లకు…