తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే చెల్లించాలని బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్పులు చెల్లించకపోవడంతో దాదాపు రూ.3 వేల కోట్లు ప్రభుత్వం బకాయి పడిందని మండిపడ్డారు. ఫీజులు కట్టాలంటూ విద్యార్థులపై కళాశాల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దాదాపు 14 లక్షల మంది బీసీ విద్యార్థులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారని…