తెలుగు సినీ పరిశ్రమలోని వేతన పెంపు సమస్యల పరిష్కారం కోసం ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్, మరియు నిర్మాతల మధ్య ముఖ్యమైన చర్చలు మొదలయ్యాయి. ఈ సమావేశం పరిశ్రమలో సాంకేతిక, ఆర్థిక, నిర్మాణ సమస్యలపై దృష్టి సారించింది. ఈ చర్చల్లో ఫెడరేషన్ కోఆర్డినేషన్ ఛైర్మెన్ వీరశంకర్, ఫెడరేషన్ యూనియన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు, ట్రెజరర్ అలెక్స్, ఫైటర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బాజీ, మహిళా ప్రొడక్షన్ నాయకురాలు లలిత తదితరులు పాల్గొన్నారు.
Also Read:Manchu Lakshmi: ముగిసిన మంచులక్ష్మీ ఈడీ విచారణ.. ఈ మూడున్నర గంటలు ఏం జరిగింది..?
నిర్మాతల తరఫున భోగవల్లి బాపినీడు, ఆచంట గోపినాథ్, ఠాగూర్ మధు, మైత్రి మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ, జెమిని కిరణ్, వివేక్ కూచిభట్ల హాజరయ్యారు. ఈ సమావేశంలో సినీ నిర్మాణ వ్యయాలు, కార్మికుల సంక్షేమం, సాంకేతిక ఆధునీకరణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. దిల్ రాజు మాట్లాడుతూ, పరిశ్రమను మరింత బలోపేతం చేయడానికి అన్ని వర్గాల సహకారం అవసరమని పేర్కొన్నారు. ఈ చర్చలు తెలుగు సినిమా పరిశ్రమకు కొత్త దిశానిర్దేశం చేసే దిశగా ఒక ముందడుగుగా భావిస్తున్నారు. గత కొంతకాలంగా వేతన పెంపు పేరుతొ సినీ షూటింగ్స్ నిలిచిపోయాయి. మరి ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు అనేది చూడాలి.