Duddilla Sridhar Babu : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎదుర్కొన్న కేసును హైదరాబాద్ నాంపల్లి కోర్టులో కొట్టేసింది. ఈ కేసు 2017లో కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ సమయంలో ఆయనపై నమోదు అయింది. కోర్టు తాజా తీర్పుతో న్యాయం జరిగింది అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, “2017లో BRS ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రైతుల భూములు బలవంతంగా లాక్కొంటుందని నిరసనగా పబ్లిక్ హియరింగ్‌కు వెళ్లాం. అప్పట్లో మేము 12మందిపై అక్రమంగా నాన్-బెయిలబుల్…
YS Jagan: రాష్ట్రంలో కనీస మద్దతు ధరలు లభించక రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడును సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారతదేశ పర్యటన వేళ.. ఆయన పర్యటనకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.. ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం వస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారతదేశ పర్యటనను వ్యతిరేకిస్తూ "వాన్స్ గో బ్యాక్.. భారతదేశం అమ్మకానికి లేదు" అనే నినాదంతో అఖిల భారత కిసాన్ సభ ఇచ్చిన దేశవ్యాప్త పిలుపు మేరకు.. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లిలో పాల కేంద్రం వద్ద రైతులు నిరసన కార్యక్రమం…
జనగామ జిల్లాలో పలు చోట్ల ఈదురు గాలులతో భారీ వడగండ్ల వాన కురిసింది. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. కొంత ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. జనగామ ,లింగాల గణపురం, రఘునాథపల్లి మండలాల్లో కురిసిన వర్షానికి పంట నేలరాలింది. పలుచోట్ల రహదారులపై చెట్లు నేలకొరిగాయి.
Jagjit Singh Dallewal: సీనియర్ రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లెవాల్ 131 రోజుల తర్వాత ఆదివారం నిరవధిక నిరాహార దీక్షను విరమించారు. పంటలకు కనీస మద్దతు ధరలపై (MSP) చట్టపరమైన హామీని, రైతులు లేవనెత్తిన ఇతర అంశాలను డిమాండ్ చేస్తూ ఆయన గత ఏడాది నవంబర్ 26న నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆదివారం రోజున ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్‌లో జరిగిన కిసాన్ మహాపంచాయత్‌లో జరిగిన రైతులు సమావేశంలో నిరాహార దీక్ష విరమించే నిర్ణయాన్ని ప్రకటించారు.
Mamnoor Airport: వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్ట్ విస్తరణ కోసం భూసేకరణ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ పరిహారం విషయంలో రైతులు, అధికారులు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఎకరానికి మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తుండగా.. అధికారులు భూసేకరణ నిబంధనల ప్రకారం మాత్రమే పరిహారం అందించగలమని స్పష్టం చేస్తున్నారు. దీనితో తమ భూములకు సరైన పరిహారం అందాలని రైతులు పట్టుబడుతున్నారు. ఎకరానికి రూ. 2 కోట్లు చెల్లించాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే, అధికారులు మాత్రం రైతులకు…
హర్యానా-పంజాబ్ శంభు సరిహద్దులో ఉద్రిక్త చోటుచేసుకుంది. వివిధ డిమాండ్లతో అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు. అయితే బుధవారం రాత్రి హర్యానా పోలీసులు.. రైతుల ఆందోళనను భగ్నం చేశారు. అన్నదాతలను అరెస్ట్ చేశారు. అనంతరం కాంక్రీట్ బారికేడ్లను బుల్డోజర్లతో తొలగించారు.
Mamunur Airport: వరంగల్ జిల్లాలో మామునూరు ఎయిర్ పోర్ట్ విస్తరణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న భూ సేకరణ సర్వేను రైతులు అడ్డుకున్నారు. ఎయిర్ పోర్ట్ కు భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. అలాగే, తమ భూములకు న్యాయపరమైన పరిహారాన్ని చెల్లించాలని ఆందోళనకు దిగారు. దీంతో పాటు నక్కలపల్లి రోడ్డు తీసేయవద్దని గుంటూరు పల్లి రైతుల డిమాండ్ చేశారు. తమకు రోడ్డు మార్గం చూపాలని ఆందోళన చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో…
KTR: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీ ఆధ్వర్యంలో రైతులు నిరసన దీక్ష చేపట్టారు. మాజీ మంత్రి కేటీఆర్ ఈ నిరసన దీక్షలో పాల్గొన్నారు. రైతుల సమస్యలపై ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేయలేదని ఆయన విమర్శించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఆనందంగా ఉన్నారని.. 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ అందించామని తెలిపారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలలు కావచ్చినా ఇప్పటివరకు…
నిజామాబాద్ మార్కెట్ యార్డులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్ పై కార్మికులు దాడికి పాల్పడ్డారు. పోలీస్ వాహనాన్ని అడ్డుకుని మరి కార్మికులు దాడి చేశారు. పసుపు దొంగతనం ఆరోపణలు నిరసిస్తూ పసుపు కాంటాలు నిలిపివేసి కార్మికులు ఆందోళన చేపట్టారు.