కాంగ్రెస్ ఏడాది పాలనలో హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ప్రజల వికాసానికి బీజేపీ పనిచేస్తుందని.. కాంగ్రెస్ పార్టీ వాళ్ల స్వలాభం కోసం పని చేస్తుందని అన్నారు. 70 ఏళ్లుగా ప్రభుత్వ వ్యతిరేకత గురించి విన్నామని.. మోడీ ప్రధాని అయ్యాక ప్రభుత్వ అనుకూలత గురించి వింటున్నామన్నారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో బీజేపీ బహిరంగ సభలో జేపీ నడ్డా ప్రసంగించారు
తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడంలో నల్గొండ జిల్లా ముందువరుసలో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి నల్గొండవాసేనని సీఎం తెలిపారు. నల్గొండలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు నూతన మెడికల్ కళాశాల భవనాన్ని ప్రారంభించారు. ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన గడ్డ ఇదంటూ ఆయన కీర్తించారు.
Ponguleti Srinivas Reddy : నిర్మల్ జిల్లా భైంసాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల కనుసైగల్లో వారి స్వార్థం కోసం నిస్వార్థంతో పనిచేసే ఉద్యోగులను భయభ్రాంతలకు గురిచేశారని మండిపడ్డారు. వారి ఫోన్లో ఏమాట్లాడారో చూసామని, భూములు లేని నిరుపేదలను రెచ్చగొట్టారు.. కలెక్టర్‌ను చంపాలని రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు. పింక్ కలర్ అసలు నాయకుల పాత్ర ఉందో దాన్నంతా ప్రభుత్వం ఎక్స్ రే…
రాజకీయాలు, రైతులు, చెరుకు పరిశ్రమకు సంబంధించి ముఖ్యమైన వ్యాఖ్యలు చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ.దామోదర్ రాజనర్సింహ రాయికోడ్ మండలం మాటూరు గ్రామంలో, గొదావరి గంగా ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (చక్కెర ఫ్యాక్టరీ) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర లక్ష్య సాధన అంశాలు కాంగ్రెస్ తోనే సాధ్యమని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి అనేక ప్రగల్బాలు పలికి గద్దేనెక్కి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వమ్ము చేసారని, 10నెలల కాంగ్రెస్ 10ఏళ్ల బీఆరెస్ పాలన దొందు దొందే రెండు పార్టీల పాలన ఒక్కటే అని ఆయన అన్నారు. గురుకుల పాఠశాలలకు రెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉంది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా కాంగ్రెస్…