వ్యవసాయ చట్టాలపై అలుపెరుగని పోరాటం చేసిన రైతులు తాత్కాలికంగా తమ పోరాటానికి విరామం ప్రకటించారు. ఇవాళ ఉదయం నుండి ఢిల్లీ సరిహద్దులను ఖాళీ చేస్తున్నారు రైతులు. శనివారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించి సొంత రాష్ట్రాలకు ప్రయాణం అవనున్నారు రైతులు. మూడు నాలుగు రోజుల్లో పూర్తి స్థాయిలో సరిహద్దులు ఖాళీ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఢిల్లీ సరిహద్దులు సింగూ ,టిక్రి ,గజీపూర్ లలో సంవత్సరంపైగా(378 రోజులు) ఆందోళన చేపట్టారు రైతులు. సంయుక్త కిసాన్ మోర్చా ,భారతీయ కిసాన్ సంఘ…