ఈ వీకెండ్ డబ్బింగ్ తో కలిపి ఎనిమిది సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. అలానే బాలీవుడ్ లో ముగ్గురు తెలుగు దర్శకులు రూపొందించిన సినిమాలు విడుదల అవుతున్నాయి.
'డ్రైవర్ జమున' తర్వాత ఐశ్వర్య రాజేశ్ నటించిన సినిమా 'ఫర్హానా'. ఈ నెల 12న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ దీన్ని నిర్మించింది.
Aishwarya: కథా బలమున్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య రాజేశ్. తన తొలి చిత్రం కాక్కాముట్టైత్రంలో ఇద్దరు పిల్లలకు నటించి ప్రశంసలు అందుకుంది.