'వివాహం జరిగి 20 సంవత్సరాలు అయింది. నువ్వు ఆమెను చాలా ఇబ్బంది పెట్టావు. ఇప్పుడు ఆమెను మర్చిపో..' ఈ మాటలు ఏదో సినిమా డైలాగ్ లాగా అనిపిస్తుంది కదూ.. కానీ ఈ డైలాగ్ వెనక ఉన్న పూర్తి విషయం తెలిస్తే అవాక్కవుతారు. పెళ్లికి ముందు అత్త, అల్లుడు ఇంటి నుంచి పారిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలోని మద్రక్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అల్లుడు తన పెళ్లికి ముందే తన కాబోయే అత్తగారితో పారిపోయాడు. ఈ సంఘటన…
ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్‌లో ఒక మహిళ తన ఇద్దరు పిల్లలను, భర్తను విడిచిపెట్టి తన ప్రేమికుడితో వివాహం చేసుకుంది. ఈ ఘటనలో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. ఈ వివాహం ఆ మహిళ భర్త చేతుల మీదుగా జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంత్ కబీర్ నగర్‌లోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Ramabanam : గోపీచంద్ హీరోగా శ్రీవాసు దర్శకత్వం వచ్చిన తాజా చిత్రం రామబాణం. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. తనకు ఇప్పటికే లక్ష్యం, లౌక్యం వంటి రెండు హిట్లు ఇచ్చిన శ్రీవాసుతో హాట్రిక్ విజయం సాధించాలని ప్రాజెక్ట్ తెరకెక్కించారు.
జగపతిబాబు, శరత్ కుమార్ ప్రధాన పాత్రధారులుగా నవీన్ చంద్ర, ఇషాన్, ఆకాంక్ష సింగ్ తో డిస్నీ హాట్ స్టార్ తొలి సీరీస్ ను నిర్మించింది. ‘పరంపర’ పేరుతో తెరకెక్కిన ఈ సీరీస్ కి కృష్ణ విజయ్ ఎల్ దర్శకత్వం వహించారు. ఈ నెల 24 నుంచి ఈ సీరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ ఫ్యామిలీ డ్రామా సిరీస్ లో అధికారం, అవినీతి, తరతరాల శత్రుత్వం ప్రధానాంశాలుగా ఉండనున్నాయి. ‘బాహుబలి’ నిర్మాతలు శోభు యార్లగడ్డ,…
సోనీ లివ్ తెలుగు ఓటీటీని ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ అందులో అన్నీ వింత వింత కథా చిత్రాలే స్ట్రీమింగ్ అవుతున్నాయి. తొలి చిత్రం ‘వివాహ భోజనంబు’ తప్పితే అన్ని వర్గాలను అలరించే చిత్రమేదీ అందులో ఆ తర్వాత రాలేదు. బహుశా డిఫరెంట్ జానర్ మూవీస్ ద్వారానే తమ ఉనికిని చాటుకోవాలని ఆ సంస్థ భావిస్తోందేమో తెలియదు! లేదా అలాంటి చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా సోనీ లివ్ నిలవాలని భావించినా తప్పులేదు. ఎందుకంటే ఇవాళ ఆ…
‘మజిలి’ , ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి చిత్రాల్లో తన మార్క్ నటనతో ఆకట్టుకుని ‘కలర్‌ఫోటో’లో హీరోగా నటించాడు కమెడియన్ సుహాస్. తాజాగా సుహాస్ హీరోగా మెహెర్ తేజ్ ను దర్శకుడుగా పరిచయం చేస్తూ ‘ఫ్యామిలీ డ్రామా’ అనే సినిమా తెరకెక్కబోతోంది. దీన్ని మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఛష్మా ఫిలింస్, నూతన భారతి ఫిల్మ్స్ ఎల్ ఎల్ పి బ్యానర్లతో కలిసి తేజా కాసరపు నిర్మిస్తున్నారు. థ్రిల్లర్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి…