Ramabanam : గోపీచంద్ హీరోగా శ్రీవాసు దర్శకత్వం వచ్చిన తాజా చిత్రం రామబాణం. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. తనకు ఇప్పటికే లక్ష్యం, లౌక్యం వంటి రెండు హిట్లు ఇచ్చిన శ్రీవాసుతో హాట్రిక్ విజయం సాధించాలని ప్రాజెక్ట్ తెరకెక్కించారు. చాలా రోజులుగా మంచి సాలీడ్ హిట్ పడలేదు గోపీచంద్ కు. ఈ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తో గోపి చంద్ కి ఒక డీసెంట్ హిట్ పడినట్టుగానే కనిపిస్తుంది. ఈ సినిమాలో డింపుల్ హాయతి హీరోయిన్ గా జగపతి బాబు, ఖుష్బు ప్రధాన పాత్రల్లో నటించారు. పూర్తి యాక్షన్, ఫైట్ సినిమాలతో విసిగెత్తి పోయిన ప్రేక్షకులకు ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంట్టైనర్ గా కనిపిస్తోంది. మొదటి నుంచి గోపి చంద్, శ్రీవాస్ కంబో పై అభిమానుల్లో మంచి గుర్తింపు ఉంది. అభిమానులతో పాటు గోపి చంద్ శ్రీవాసుపై పెట్టుకున్న నమ్మకాన్ని నిరుత్సాహ పరచకుండా మంచి సినిమా తీశాడు.
Read Also:Health Tips : శరీరానికి హాని కలిగించే ఆహారాలు ఏంటో తెలుసా..?
ఇది ఇలా ఉంటే ఈ కథ సిద్ధం చేసేటప్పుడే దర్శకుడు శ్రీవాసు కథకు తగ్గ హీరో ఎవరోకు ఒడ్డు, పొడవు బాగా ఉన్న మెగా హీరో వరుణ్ తేజ్ అయితే బాగుంటుంది అని అనుకున్నాడట. అనుకున్నట్టుగానే కథను వరుణ్ తేజ్ కి నెరేట్ చేశాడట. కానీ ఫ్యామిలీ డ్రామాతో పాటు భారీ ఎమోషన్ తనకు అస్సలు సూట్ కావని ఈ సినిమాను వద్దన్నాడట. తన కథకు సరైన హీరో అని నమ్మిన శ్రీవాసుకు వరుణ్ తేజ్ నో చెప్పడంతో అలాంటి పర్సనాలిటీ ఉన్న హీరో నే కావాలని శ్రీవాస్ చాలా ట్రై చేయగా, తనకు బాగా అచ్చొచ్చిన గోపి చంద్ మాత్రమే కరెక్ట్ అనిపించి అతడిని పెట్టి సినిమా తీశాడు. సినిమాలో కొన్ని నెగటివ్ పాయింట్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా కుటుంబం మొత్తం కూర్చొని సరదాగా ఎంజాయ్ చేయగలిగే సినిమా గా మాత్రం రామబాణం ఉంటుంది.
Read Also:Rains: ఈ వేసవిలో 28 శాతం అధిక వర్షపాతం.. ఐఎండీ రిపోర్ట్..