Wife Murdered Husband: గుజరాత్‌లోని గాంధీనగర్‌లో దాంపత్య జీవితం ఒక భయంకరమైన ఘటనకు దారి తీసింది. పెళ్లయిన నాలుగో రోజున పాయల్ అనే మహిళ తన భర్త భావిక్‌ను ప్రేమికుడు కల్పేష్ సహాయంతో హత్య చేసింది. వివాహానికి ముందు పాయల్ తన బంధువు కల్పేష్‌తో ప్రేమలో ఉండగా.. వారి పెళ్ళికి పెద్దలు నిరాకరించారు. ఆ తర్వాత భావిక్‌తో పెళ్లి చేశారు. పెళ్లి అయిన తరువాత, పాయల్ తన ప్రేమికుడితో కలిసి కుట్ర పన్ని భావిక్‌ను హత్య చేసింది.
Also Read: Allu Arjun In Megastar Home: చిరు ఇంటికి అల్లు అర్జున్.. ఆ అంశాలపై చర్చ?
భావిక్ తన భార్యను అత్తమామల ఇంటి నుండి తీసుకురావడానికి వెళ్లిన సమయంలో పాయల్, కల్పేష్‌కు సమాచారం అందించింది. కల్పేష్ తన సహచరులతో కలిసి ఇన్నోవా కారులో వెళ్లి భావిక్ యాక్టివాను ఢీకొట్టి అతడిని కిడ్నప్ చేసారు. అనంతరం కారులో అతడి గొంతుకోసి హత్య చేశారు. ఆ తర్వాత శవాన్ని గుర్తించకుండా నర్మదా కాలువలో పడేసినట్లు కల్పేష్ పోలీసులకు విచారణలో తెలిపాడు. భావిక్ కిడ్నప్ జరిగిన వెంటనే అతడి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. భార్య పాయల్‌పై అనుమానం రావడంతో పోలీసులు ఆమెను క్షుణ్ణంగా విచారించారు. దాంతో పాయల్ తన ప్రియుడు కల్పేష్‌తో కలిసి ఈ హత్య చేసిందని అంగీకరించింది.
దాంతో ఈ కేసులో కల్పేష్‌తో పాటు అతని ఇద్దరు సహచరులను పోలీసులు అరెస్టు చేశారు. పాయల్‌ను కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ప్రేమ పేరుతో భర్తను హత్య చేసిన ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పెళ్లయిన నాలుగు రోజులకే భర్తను హతమార్చిన పాయల్ ఈ ఘటన కారణంగా జీవితాంతం జైలులో గడపాల్సి ఉంటుంది.