Falcon-9 Rocket: భారతదేశం తన అత్యంత అధునాతనమైన బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT-20ని ప్రయోగించనుంది. దీనిని GSAT N-2 అని కూడా పిలుస్తారు. వచ్చే వారం దీనిని ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ‘‘ఫాల్కన్ 9’’ రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరగబోతోంది. ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్‌కి అత్యంత సన్నిహితుడైన ఎలాన్ మస్క్‌కి చెందిన సంస్థతో ఇస్రో భాగస్వామ్యైంది.
స్పేస్ ఎక్స్ 250వ రాకెట్‌ను సేఫ్ గా ల్యాండింగ్ చేసేసింది. తాజాగా ఫాల్కన్ 9 రాకెట్‌ను కాలిఫోర్నియా తీరంలో వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి సక్సెస్ ఫుల్ గా ప్రయోగించింది. ఐర్లాండ్‌కు చెందిన తొలి శాటిలైట్, దక్షిణ కొరియా నిఘా ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా ప్రయోగించారు.