కేటుగాళ్ళు ఎక్కవవుతున్నారు. నకిలీ పోలీసులు,నకిలీ రిపోర్టర్లుగా చలామణి అవుతున్న ఇద్దరి ఆటకట్టించారు మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు. ఇద్దరిని అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులు వారి వివరాలు వెల్లడించారు. మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మసాజ్ సెంటర్ లలో నకిలీ ఎస్వోటీ పోలీసుల పేరుతో మాముళ్ళు వసూలు చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామన్నారు. నిందితుల వద్ద నుండి ఒక ద్విచక్ర వాహనం,2 మొబైల్ ఫోన్స్,2 నకిలీ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. మోడెజబా మనిక్ (32),కొత్తగాడి అమర్నాథ్…