AP High Court: కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ న్యాయాధికారి ఏఐ టెక్నాలజీ సహాయంతో ఉత్తర్వులు జారీ చేయగా, ఆ ఉత్తర్వులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏఐ వినియోగంపై న్యాయవ్యవస్థలో అప్రమత్తత అవసరమని హైకోర్టు స్పష్టం చేసింది. తీర్పులు, ఉత్తర్వులు ఇచ్చే విషయంలో ఏఐ సమాచారాన్ని యథాతథంగా స్వీకరించవద్దని న్యాయమూర్తులకు హైకోర్టు సూచించింది. ఏఐ సాధనాలు న్యాయాధికారులకు సహాయక సాధనాలు మాత్రమేనని, విశ్లేషణ సామర్థ్యానికి…