Raithu Bheema: మెదక్ జిల్లాలో రైతు బీమా సొమ్ము కోసం చావు నాటకానికి తెరతీసిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మెదక్ జిల్లా గుట్టకిందిపల్లి గ్రామంలో బతికే ఉన్న ఇద్దరు రైతులు చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ సృష్టించి రైతు బీమా డబ్బులను దొంగిలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ బాగోతం తాజాగా నిర్వహించిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేతో బయటపడింది. గ్రామానికి చెందిన శ్రీను, మల్లేశం అనే ఇద్దరు రైతులు రైతు బీమా డబ్బుల…