విశాఖపట్నం…. చీకటి వ్యాపారాలకు రాచమార్గంగా మారింది. ఇతర దేశాలు,రాష్ట్రాల నుంచి యథేచ్ఛగా.. నిషేధిత సరుకుల సరఫరా జరిగిపోతోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ముఠాలు చాకచక్యంగా వ్యవహరించి కోట్లకు పడగలెత్తుతున్నాయి. బలహీనతను చంపుకోలేని జనం మాత్రం బలైపోతున్నారు.ఇటీవల విశాఖ రైల్వే స్టేషన్‌లో భారీ ఫేక్ సిగరెట్ డంప్ బయటపడింది. కల్తీ సిగరెట్లు బ్రాండెడ్‌కు దగ్గరగా ఉంటూ ధూమపాన ప్రియులను తక్కువ ధరలతో ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. గతంలో ఐటీసీ గుర్తింపు పొందిన కంపెనీల సిగరెట్స్ మాత్రమే మార్కెట్లో అందుబాటులో…